నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

W.G: అత్తిలి మండలంలోని విద్యుత్ మెయింట్‌నెన్స్ పనుల్లో భాగంగా, అత్తిలి, మంచిలి, కొమ్మర, ఉరదాళ్లపాలెం, పాలూరు, అరవిల్లి, దంతుపల్లి, గుమ్మంపాడు, తిరుపతిపురం, బల్లిపాడు తదితర అన్ని గ్రామాలలో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డీఈ నరసింహమూర్తి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ ఉండదన్నారు.