భారీ వర్షం ఎఫెక్ట్ నీటి సరఫరాకు అంతరాయం

ATP: రాయదుర్గం పట్టణంలో మంగళవారం ఉదయం 3 గంటల నుండి ఎడతెరిపిలేని భారీ వర్షం నమోదు అయ్యింది. వీరాపురం పంప్ హౌస్ సబ్ స్టేషన్ వద్ద 33 కెవి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల నీటి పంపింగ్ సరఫరా జరగలేదని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. దీంతో ఇవాళ పట్టణంలో నీటి సరఫరా జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు చేప్పారు. కావున పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.