సామాన్యుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

సామాన్యుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

BDK: కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుల సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. చర్ల మండలం C. కత్తిగూడెం గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శనివారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి కార్యాలయంలోకి ప్రవేశించారు. అనంతరం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.