పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు
AP: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఇవాళ సత్యసాయి శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. శత జయంతి వేడుకలకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, జస్టిస్ ఎన్వీ రమణ తదితరులు హాజరుకానున్నారు. అలాగే, రేపు పుట్టపర్తిలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లకు ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.