'11 గ్రామాలకు నిధులు ఇవ్వడం లేదు'
SRCL: 11 గ్రామాలకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిధులు ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఇల్లంతకుంటలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ మారాలని సర్పంచులను ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడని మండిపడ్డారు. ఉపాధి హామీ ద్వారా కేంద్రం నుంచి 60% నిధులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40% మాత్రమే నిధులు ఇస్తున్నారని తెలిపారు.