'అవినీతి రహిత సమాజానికి కృషి చేద్దాం'
SRD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ అవినీతి నిర్మూలన కార్యక్రమాల పోస్టర్లను కలెక్టర్ ప్రావీణ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అవినీతి రహిత సమాజానికి కృషి చేద్దామన్నారు. జిల్లాలో అవినీతి నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఫిర్యాదుదారల వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు పాల్గొన్నారు.