తగ్గు ముఖం పడుతున్న గోదావరి

W.G: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గత మూడు రోజులుగా ఆచంట నియోజకవర్గంలోని గోదావరి ఉధృతంగా ప్రవహించింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో వశిష్ట గోదావరి తీరం వెంబడి ఉన్న రేవులు ముంపు నుంచి బయటపడుతున్నాయి. ఈ మేరకు లంక గ్రామాల ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు.