ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ మాత్రమే: ఆర్ఎంవో
వనపర్తి ఎంసీహెచ్లో విస్ఫోటనం కాదని ఆక్సిజన్ సిలిండర్ లీకేజీ మాత్రమేనని ఆర్ఎంవో డాక్టర్ బంగారయ్య తెలిపారు. సిలిండర్ వాల్వ్ అవసరమైన దాని కంటే ఎక్కువ ఓపెన్ చేయటంతో ఎలక్ట్రిషన్‌కు గాయమైందని, శబ్దానికి కొందరు అటు ఇటు పరిగెత్తడంతో నర్సు జారిపడిందన్నారు. ఇద్దరు క్షేమంగానే ఉన్నారని ప్రాణాపాయం లేదన్నారు. వారిని వైద్యం కోసం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించామన్నారు.