రోడ్ సేఫ్టీ పనుల స్థల పరిశీలన చేసిన అధికారులు
PDPL: బస్టాండ్, అయ్యప్ప టెంపుల్ వద్ద రోడ్ సేఫ్టీ పనులను గురువారం మున్సిపల్, RTC, ట్రాఫిక్ అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ పరిశీలించారు. ఇటీవల కలెక్టర్ కోయ శ్రీహర్ష అధ్యక్షతన జరిగిన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో ఇచ్చిన సూచనల మేరకు బస్సులు, వాహనదారులు సురక్షితంగా ప్రయాణించేందుకు రోడ్ వెడల్పు, ఫ్రీ లెఫ్ట్ ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేశారు.