జాతీయస్థాయిలో ఫస్ట్ ప్రైజ్ సాధించిన సర్పంచ్
KNR: చొప్పదండి మండలం కోనేరుపల్లె గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాల్ రాజు జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన సర్పంచ్ సంవాద్ యాప్‌ను ఉపయోగించి, భారత ప్రభుత్వం ఇచ్చిన "క్రీడా మిత్ర పంచాయతీ" ప్రణాళికలో భాగంగా MLA మేడిపల్లి సత్యం సహకారంతో యువతని క్రీడలవైపు మళ్ళించే విధంగా కృషి చేసినందుకు గాను ఆయనకు రూ.35వేల నగదు బహుమతి లభించింది.