అభయ ప్రదాయనిగా బండ్లమ్మ తల్లి దర్శనం

గుంటూరు: పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ భగలాముఖి అమ్మవారి ఆలయంలో ఆదివారం బండ్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టుచీర, బంగారు ఆభరణాలతో ప్రత్యేక అలంకరణ చేసి అభయ ప్రధాయనిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.