త్వరలో EMI కట్టే వారికి గుడ్ న్యూస్?
రెపో రేటులో ఆర్బీఐ మార్పులు చేయకపోయినా, త్వరలో లోన్ EMIలు తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2025లో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ, బ్యాంకులు ఆ పూర్తి ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించలేదు. దీంతో ఈసారి 36 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు భావిస్తున్నారు. రానున్న మూడు నెలల్లో బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని బదిలీ చేస్తే, ఇల్లు, వాహన రుణాలపై వడ్డీ తగ్గుతుంది.