స్థానిక పోరులో గెలుపే లక్ష్యం: టీడీ జనార్దన్
EG: టీడీపీ పొలిటికల్ సెక్రటరీ, పొలిట్‌బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ ఆదివారం కొవ్వూరులోని టీడీపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని జనార్దన్ సూచించారు.