'స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలి'

SRPT: స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని న్యాయవాది మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. మంగళవారం చివ్వెంల మండలం దురాజ్ పల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ముస్లిం, మైనార్టీ యోధుల చిత్రపటాలతో రూపొందించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.