తాళం వేసిన ఇంట్లో చోరీ
NRML: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన దస్తూరాబాద్ మండలంలోని రేవోజిపేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేవోజిపేట గ్రామంలోని కొత్త పల్లెలోని ముప్పిడి రాధ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. కాగా, స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు.