'రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలి'

'రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలి'

KNR: చొప్పదండి MLA మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో సమావేశమయ్యారు. చొప్పదండి నియోజకవర్గంలో రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలని కోరారు. యూరియా పంపిణీ ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, అధికారులతో నిరంతరం పర్యవేక్షణ చేయించాలని కోరారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో ఎరువుల దుకాణాలను తరచుగా సందర్శిస్తూ రైతులకు ఎరువుల లభ్యత సమాచారం ఇవ్వాలన్నారు.