నేడు డయల్ యువర్ కమిషనర్
KDP: మైదుకూరు పురపాలక సంఘం కమిషనర్ వై.రంగస్వామికి చరవాణి (80085 59302) ద్వారా సమస్యలు తెలియజేసే అవకాశం కల్పిస్తోంది. తాగునీరు, మురుగు, చెత్త, విద్యుత్ సమస్యలు ఉంటే బుధవారం చరవాణి ద్వారా నేరుగా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లవచ్చు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.