క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎస్సై

క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎస్సై

SRPT: నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని నర్సయ్యగూడెంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను శనివారం ఎస్సై రవీందర్ నాయక్ ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని, యువత పెడదారి పట్టకుండా క్రీడలు మంచి మార్గాన్ని చూపుతాయని, క్రీడలు నిర్వహిస్తున్న అంబేద్కర్ యూత్ కమిటీని అభినందించారు.