రేపు సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ

రేపు సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ

TG: ఆపరేషన్ సింధూర్‌పై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత సైన్యానికి సంఘీభావంగా రేపు సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించనున్నారు. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్‌రోడ్ వరకు ఈ ర్యాలీ జరగనుంది. ఇందులో సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.