మంత్రిని కలిసిన ఎంపీ దంపతులు
NLR: డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ సమావేశం జిల్లా ఇంఛార్జ్ మంత్రి మహమ్మద్ ఫరూక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే ఆయనను R&B గెస్ట్ హౌస్‌లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛం అందించి జిల్లా వ్యాప్తంగా పలు సమస్యలపై చర్చలు చేసినట్లు ఎంపీ ఈ సందర్భంగా తెలిపారు.