మానవత్వం చాటుకున్న స్నేహితులు
PDPL: జూలపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామానికి చెందిన ఎల్కపల్లి తిరుపతి అనే వికలాంగుడు ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. ఆయనకు భార్య, పెళ్లి ఈడుకు వచ్చిన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ సందర్భంగా తిరుపతితో కలిసి చదువుకున్న డిగ్రీ స్నేహితులు వారి కుటుంబాన్ని పరామర్శించి, రూ. 37,601 ఆర్థిక సహాయం అందజేశారు.