ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్.. ఎప్పుడంటే?
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న సినిమా 'ఫౌజీ'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా విడుదలపై నయా న్యూస్ బయటకొచ్చింది. ఈ చిత్రం 2026 ఆగస్టులో రిలీజ్ కానున్నట్లు గతంలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను 2026 అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.