ఓట్ల కోసం బట్టలు ఉతుకుతూ ప్రచారం.!
MDK: శివంపేట మండలం అల్లీపూర్ గ్రామ 1వ వార్డులో వార్డు సభ్యురాలి భర్త చాకలి బాబు వినూత్నంగా ప్రచారం చేశారు. తన భార్య తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్లి మహిళలతో కలిసి బట్టలు ఉతుకుతూ, గ్రామంలోని సమస్యలపై చర్చిస్తూ ప్రజలకు చేరువయ్యారు. ఈ వింత ప్రచారం అల్లీపూర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆసక్తిని రేకెత్తించింది.