సాయుధ ముఠాల దాడి.. 20 మంది మృతి
నైజీరియాలోని ప్లాటూ స్టేట్‌లో సాయుధ ముఠాలు బరితెగించాయి. కానమ్ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న భద్రతా బలగాలనే లక్ష్యంగా ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సీనియర్ ఆర్మీ అధికారులు సహా 12 మంది భద్రతా సిబ్బంది, వారికి సాయంగా ఉన్న 8 మంది స్థానిక విజిలెంట్ సభ్యులు మరణించారు. దాడి అనంతరం దుండగులు సమీప గ్రామాలపై పడి పశువులను, ఆస్తులను దోచుకెళ్లారు.