రాంబిల్లికి 62.055 మెట్రిక్ టన్నుల యూరియా

AKP: రాంబిల్లి మండలానికి 62.055 మెట్రిక్ టన్నుల యూరియాలో ప్రభుత్వం సరఫరా చేసినట్లు ఏవో సుమంత ఆదివారం తెలిపారు. మామిడివాడ, లాలం కోడూరు, గోకివాడ, రాజ కోడూరు రైతుసేవ కేంద్రాలకు 12.51 మెట్రిక్ టన్నుల చొప్పున కేటాయించామన్నారు. దిమిలికి 12.015 మెట్రిక్ టన్నులు సరఫరా చేసామన్నారు. ఈనెల 15 నుంచి రైతులకు యూరియా పంపిణీ చేస్తామని చెప్పారు.