నూతన లేబర్ చట్టాలు కార్మికులకు మరణ శాసనం
NGKL: జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో గురువారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్ హాజరయ్యారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 కొత్త లేబర్ చట్టాలు కార్మికులను బానిసత్వంలోకి నెట్టివేస్తాయని,ఆ చట్టాలు కార్మికుల హక్కులకు మరణశాసనం అని అన్నారు. చట్టాల రద్దుకు పోరాడుతామని తెలిపారు.