ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోను

VSP: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆరోపించారు. ముఖ్యంగా తాను వైసీపీ కోవర్టునని పల్లా శ్రీనివాసరావు అనుచరుడు చేసిన ఆరోపణ పట్ల తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పదవికి పల్లా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలని డిమాండ్ చేశారు.