లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షులు
BHNG:యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన స్వామి వారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి, స్వామి వారి తీర్థప్రసాదాలు వారికి అందించారు.