బియ్యం గోదామను తనిఖీ చేసిన గిడ్డంగుల సంస్థ చైర్మన్

KMM: రఘునాధపాలెం మండలం మంచుకొండలోని సన్న బియ్యం నిల్వ చేస్తున్న గోదాంను మంగళవారం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల వెంకటేశ్వర రావు ఆకస్మికంగా పరిశీలించారు. గోదాంలో ఉన్న సన్న బియ్యం నిల్వలను, రిజిస్టర్లను, భద్రత తదితర అంశాలను తనిఖీ చేశారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వహకులను హెచ్చరించారు.