పోగొట్టుకున్న సెల్ ఫోన్ బాధితుడికి అందజేత
SRPT: పోగొట్టుకున్నసెల్ ఫోన్ బాధితుడికి అందజేసిన సంఘటన పట్టణంలో చోటుచేసుకుంది. సూర్యాపేట కొత్త బస్టాండ్ ఫ్లై ఓవర్ సమీపంలో శుక్రవారం ఆత్మకూరు యస్ మండలము దాచారం గ్రామానికి చెందిన బుడిగెబోయిన వీరయ్య అనే వ్యక్తి ఓ హోటల్‌లో టిఫిన్ చేసి కవరు మరిచిపోయాడు. ఏపూరుకి చెందిన విజయ్ కుమార్‌కు దొరికడంతో బాధితునికి సమాచారం అందించి వారికి అందజేశారు.