మీరు కూడా అప్పు తీసుకున్నారా..?
లక్షలాది మంది అప్పుల వలలో చిక్కుకుంటున్నారు. డిజిటల్ లోన్లు, క్రెడిట్ కార్డులు సులభంగా లభిస్తుండడంతో కుటుంబాల అప్పులు భారీగా పెరిగాయి. అప్పులు తీసుకున్నవారు అధిక వడ్డీలు చెల్లించడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆర్బీఐ డేటా ప్రకారం 2024-25 నాటికి ఇండియాలో కుటుంబాల అప్పులు రూ. 15.7 లక్షల కోట్లకు పెరిగాయి.