'పత్తి పంటకు మద్దతు ధర ఇవ్వాలి'

'పత్తి పంటకు మద్దతు ధర ఇవ్వాలి'

KMM: రైతులు పండించిన పత్తి పంటకు క్వింటాకు రూ.10,075 మద్దతు ధర కల్పించాలని సీపీఐ మండల కార్యదర్శి జాగర్లమూడి రంజిత్ కుమార్, అమరనేని వీరభద్రమ్ డిమాండ్ చేశారు. సోమవారం ఏన్కూర్ మండల రైతు సంఘం సమావేశం మేడ భూషయ్య అధ్యక్షతన జరిగింది. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతోందని పేర్కొన్నారు.