నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
గుంటూరులోని లక్ష్మీపురం మెయిన్ రోడ్డు, చంద్రమౌళీనగర్ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. గురవయ్య గురువారం తెలిపారు. చెట్టుకొమ్మల తొలగింపు, విద్యుత్ లైన్ల పునరుద్దరణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వినియోగదారులు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.