కాలువలో మృతదేహం కలకలం

కాలువలో మృతదేహం కలకలం

కృష్ణా: విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బీఆర్డీఎస్ రోడ్ ఫుడ్ జంక్షన్ వద్ద మృతదేహం కలకలం రేపింది. రైల్వే ఇనిస్టిట్యూట్ దగ్గర సైడ్ డ్రైనేజీ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరి మృతదేహాన్ని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.