నితీష్ ఇంటి ముందు 'టైగర్' పోస్టర్
బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న వేళ పట్నాలో సీఎం నితీశ్ కుమార్ పోస్టర్లు వెలిశాయి. 'టైగర్ జిందా హై' అనే బ్యానర్‌తో నితీశ్ పోస్టర్లను ఆయన అభిమానులు వేశారు. ఎగ్జిట్ పోల్స్‌లో తిరిగి NDA కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పిన నేపథ్యంలో ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. 'నితీశ్.. దళితులు, వెనుకబడినవారు, అగ్రవర్ణాలు, మైనార్టీల రక్షకుడు' అని దానిలో రాశారు.