పట్టణంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

పట్టణంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

కర్నూలు పట్టణంలోని గణేష్ నగర్ కాలనీలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. ఆయన తన గన్‌మెన్ మద్దిలేటి కుమార్తె వివాహ ముహూర్తం వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వివాహ వేడుకలో ఆయన వెంట స్థానిక నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.