VIDEO: మధురానగర్‌లో ఓటేసిన హైడ్రా కమిషనర్
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అందరూ ఓటు వేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. మధురానగర్‌లోని శ్రీనిధి విశ్వభారతి హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 132లో ఆయన కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు తప్పకుండా ఓటు హక్కును తమవంతు బాధ్యతగా వేయాలని పిలుపునిచ్చారు. ఉదయం 11 తర్వాత ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు.