‘గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి’

‘గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి’

అల్లూరి: గర్భిణులు, బాలింతలు విధిగా పౌష్టికాహారం తీసుకోవాలని కొయ్యూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో విజయ కుమారి సూచించారు. ఆమె శుక్రవారం మండలంలోని ఆడాకుల పంచాయతీ పరిధిలో ఉన్న ఆడాకుల, కించెలి, క్రిష్టారం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ముందుగా ఆయా కేంద్రాల్లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులతో మాట్లాడుతున్నారు.