ఘోర ప్రమాదం.. వంతెన కూలి నలుగురు మృతి

ఘోర ప్రమాదం.. వంతెన కూలి నలుగురు మృతి

చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. నదిపై నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించగా, మరో 12 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నిర్మాణ సమయంలో స్టీల్ కేబుల్ తెగిపోవడంతో జరిగిందని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.