కాసేపట్లో రామోజీ ఎక్స్‌లెన్స్ పురస్కారాల ప్రదానం
TG: రామోజీ ఫిల్మ్‌సిటీలో కాసేపట్లో రామోజీ ఎక్స్‌లెన్స్ పురస్కారాల ప్రదాన కార్యక్రమం మొదలు కానుంది. ఏడు రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచినవారికి రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులు ఇవ్వనున్నారు. జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, మానవ సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కళ-సంస్కృతి, యూత్ ఐకాన్, మహిళా సాధికారత రంగాల్లో కృషి చేసిన వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు.