కొత్తకోట వద్ద బైక్ ప్రమాదం.. ఇద్దరు గాయాలు
AKP: కొత్తకోట పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోలుగుంట వైపు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి మరో బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారు కొత్తకోటకు చెందిన ఆర్య, జెడ్.కొత్తపట్నం గ్రామానికి చెందిన రమణగా గుర్తించారు. వారిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.