మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన వాసవి అమ్మవారు
MBNR: జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ బ్రాహ్మణవాడి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున దేవాలయానికి చేరుకున్నారు. దర్శనానికి ఆలయ కమిటీ సభ్యులు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.