డ్రోన్లతో సారా పట్టివేత

TPT: జిల్లా పోలీసులు డ్రోన్లతో నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఎర్రవారిపాలెం మండలం వేములవాడ గ్రామం తలకోన వాటర్ కెనాల్ సమీపంలో చెట్టు తొర్రలో 9లీటర్ల సారా నిల్వ ఉంచారు. పోలీస్ సిబ్బంది డ్రోన్ కెమెరాల సహాయంతో ఆదివారం పట్టుకున్నారు. అధునాతన డ్రోన్ కెమెరాలతో నేరాలను నివారిస్తామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు.