నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్..

కృష్ణా: మచిలీపట్నం భాస్కరపురం విద్యుత్ సబ్ స్టేషన్ పరిదిలో 11కేవీ విద్యుత్ లైన్ల మరమ్మత్తుల్లో భాగంగా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్టు ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ భాస్కరరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9గంటల నుండి 11 గంటల వరకు రైలుపేట, భాస్కరపురం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్టు తెలిపారు.