VIDEO: బొమ్మనహాళ్‌లో హెచ్ఎల్‌సీ గండి పూడ్చివేత
ATP: బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు-నాగలాపురం మద్య HLC ప్రధాన కాలువకు గండిపడిన ప్రదేశంలో అధికారులు యుద్ద ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశాలతో నీటి ప్రవాహాన్ని తగ్గించి DE మద్దిలేటి, AEE ఆల్తాఫ్ ఆదివారం JCB సహాయంతో పూడ్చివేత పనులు చేపట్టారు. గండిని మట్టితో కప్పి తాత్కాలికంగా పనులు పూర్తి చేశామన్నారు.