మబుగామంలో సావిత్రమ్మ వర్ధంతి పూజలు

మబుగామంలో సావిత్రమ్మ వర్ధంతి పూజలు

SKLM: పోలాకి మండలం మబుగాం గ్రామంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ తన తల్లి దివంగత ధర్మాన సావిత్రమ్మ 13వ వర్ధంతిని గురువారం నిర్వహించారు. శృతి వనంలోని ఆమె స్తూపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ధర్మాన రాందాస్, ధర్మాన పద్మ ప్రియా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.