ఈ నెల 18 వరకు సెక్షన్ 163 అమలు
KMR: జిల్లాలో జరుగుతున్న జీపీ ఎన్నికల మూడవ దశ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లాలోని అన్ని ఎన్నికల ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధిస్తూనట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సెక్షన్ 163 డిసెంబర్ 18 ఉదయం 10 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, న్యాయంగా జరిగేందుకు పౌరులు, సంస్థలు నిషేధాజ్ఞలను ఖచ్చితంగా పాటించాలన్నారు.