భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు: JC
NLR: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నందున కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల వలన ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూం నెంబర్‌కు0861 2331261 సమాచారం ఇవ్వాలన్నారు.