కాలువలోకి దూకి వ్యక్తి ఆత్మహత్యయత్నం

GNTR: తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన చావలి ఆర్మ్‌స్ట్రాంగ్(45) గురువారం కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఏడేళ్ల క్రితం భార్య మరణించడంతో ఒంటరిగా ఉంటున్న ఆయన ఇంట్లో నుంచి బయలుదేరి వంతెన వద్ద ఒక సోడా బండి నిర్వాహకుడికి తన సెల్ ఫోన్ ఇచ్చి కాలువలోకి దూకినట్లు స్థానికులు తెలిపారు. ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.