VIDEO: జిల్లాలో కదం తొక్కిన వైసీపీ శ్రేణులు
ఏలూరు: జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో మంగళవారం పాత బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ వద్ద వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుమల పవిత్రతను కాపాడవలసిన ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేసిందన్నారు. బి.ఆర్.నాయుడును వెంటనే చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.